విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కరణ్ జొహార్?

  • సుశాంత్ మరణం తర్వాత కరణ్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • బయటి వారిని ఎదగనీయడం లేదని కామెంట్లు
  • స్టార్ కిడ్స్ తో సినిమాలను పక్కన పెట్టాలని కరణ్ నిర్ణయం
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఎంతో మంది బాలీవుడ్ చీకటి కోణాలపై గళమెత్తుతున్నారు. స్టార్ కిడ్స్ కు తప్ప బయట నుంచి వచ్చే వారికి ఇండస్ట్రీలో సహకారం ఉండటం లేదని విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలో బయటి వారిని ఎదగనీయడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా దర్శకనిర్మాత కరణ్ జొహార్ ను ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్నారు. సినీ ప్రముఖుల పిల్లలతో మాత్రమే కరణ్ జొహార్ సినిమాలు చేస్తుండటమే దీనికి కారణం.

ఇటువంటి తీవ్ర విమర్శల నేపథ్యంలో కరణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. కొంత కాలం కాలం పాటు స్టార్ కిడ్స్ తో సినిమాలను తన బ్యానర్ లో తెరకెక్కించకూడదని కరణ్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్లాన్ చేసిన చిత్రాలను కూడా క్యాన్సిల్ చేసుకునే యోచనలో ఉన్నాడట.

Karan Johar
Bollywood

More Telugu News